మెగా ఫ్యామిలీలో దీన్ని గమనించారా?
close

తాజా వార్తలు

Published : 20/08/2020 12:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెగా ఫ్యామిలీలో దీన్ని గమనించారా?

హైదరాబాద్‌: చిత్ర పరిశ్రమలో కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా జరిగిపోతుంటాయి. అది జరిగిన తర్వాత ‘అరె గతంలో ఫలానా వ్యక్తికి కూడా ఇలాగే అయ్యింది’ అంటూ చెప్పుకుంటారు. గతంలో చిరంజీవి-సాయిధరమ్‌ తేజ్‌ విషయంలో ఇదే జరిగింది. చిరంజీవి నటించిన తొలి సినిమా ‘పునాది రాళ్లు’ కన్నా ఆ తర్వాత నటించిన ‘ప్రాణం ఖరీదు’ ముందుగా విడుదలైంది. సాయితేజ్‌ నటించిన ‘రేయ్‌’ కన్నా తర్వాత చిత్రీకరణ జరుపుకొన్న ‘పిల్లా నువ్వు లేని జీవితం’ మొదటగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇలాంటి సంఘటన కూడా మెగా ఫ్యామిలీలో మరోసారి జరిగింది. వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం  తెరకెక్కుతోంది. ఇది వైష్ణవ్‌ నటిస్తున్న రెండో సినిమా కాగా, వరుణ్‌తేజ్‌ కూడా తన రెండో చిత్రాన్ని క్రిష్‌ దర్శకత్వంలో చేయడం విశేషం. వరుణ్‌-క్రిష్‌ కాంబినేషన్‌లో రెండో చిత్రంగా ‘కంచె’ తెరకెక్కింది. ఇప్పుడు తన రెండో చిత్నాన్ని వైష్ణవ్‌ తేజ్‌.. క్రిష్‌ దర్శకత్వంలో నటిస్తుండటం విశేషం.

జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అటవీ నేపథ్యంలో సాగే కథ ఇది. ఇప్పటికే చిత్రీకరణ ఆరంభమైంది. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్వరాలు సమకూర్చనున్నారు. నలభై రోజులపాటు ఏకధాటిగా సాగే షెడ్యూల్‌తో చిత్రాన్ని పూర్తి చేయనున్నారు. ఇక వైష్ణవ్‌ నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడిన తర్వాత దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని