
తాజా వార్తలు
మెగా న్యూస్: ‘ఉప్పెన’ రిలీజ్ డేట్ ఫిక్స్!
హైదరాబాద్: మెగా అభిమానులకు శుభవార్త. వైష్ణవ్‌తేజ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన లవ్‌స్టోరీ ‘ఉప్పెన’. కృతిశెట్టి కథానాయిక. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల ఎప్పుడా? అని ఎదురు చూస్తున్న అభిమానులకు చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 12న ‘ఉప్పెన’ను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
గతేడాది చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2020 వేసవిలోనే విడుదల కావాల్సి ఉంది. కరోనా వైరస్, లాక్డౌన్ రావడంతో సినిమా విడుదల వాయిదా పడింది. ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని అంతా భావించారు. అయితే, మెగాస్టార్ కుటుంబం నుంచి మరో యువ నటుడు వెండితెరకు పరిచయమవడం, సుకుమార్ కథ అందించడం ఇలా భారీ అంచనాలు ఉండటంతో సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు మొగ్గు చూపారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చింది.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియోలు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించాయి.