close

తాజా వార్తలు

Published : 04/08/2020 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నువ్వో సగం.. నేనో సగం

కొంతమంది భార్యాభర్తలను చూస్తే భలే ముచ్చటేస్తుంది. వాళ్లు ఒకరికోసం ఒకరు అన్నట్టుగా ఉంటారు. అసలు వీళ్ల మధ్య గొడవలే రావా అనే సందేహం కూడా వస్తుంది. అందరూ వాళ్లలాగే ఆనందంగా ఉండాలంటే ఏమేం చేయాలంటే...

బాధ్యతలను పంచుకోవాలి: సంసారమనే సౌధానికి ఆలూమగలిద్దరూ రెండు స్తంభాల్లాంటి వాళ్లు. బాధ్యతలను ఇద్దరూ సమానంగా పంచుకుంటేనే ఆ సౌదం ఠీవిగా నిలబడుతుంది. నిజానికి చాలా కుటుంబాల్లో బరువంతా ఒక్కరి మీదే పడుతుంది. ఒకరు ఆఫీసుకు వెళ్లి వచ్చి సోఫాలో కూర్చుని బద్ధకంగా టీవీ చూస్తుంటారు. మరొకరు ఆఫీసులో కష్టపడి ఇంటికి వచ్చీరాగానే మళ్లీ పనులు అందుకుంటారు. అంటే ఇంటి పనుల భారమంతా ఒక్కరి మీదే పడుతుందన్న మాట. దాంతో విపరీతమైన ఒత్తిడికి గురై అనారోగ్యాల బారినపడతారు. అంతేకాదు తనకు ఎలాంటి సహకారం అందడం లేదనే ఆందోళనతో మానసికంగానూ బలహీనపడే అవకాశముంది.

పారదర్శకత: అరమరికలు లేకుండా ఇద్దరూ అన్ని విషయాల గురించి మాట్లాడుకోవాలి. అందులో వ్యక్తిగత అలవాట్లు, అభిరుచుల గురించి ఉండవచ్ఛు ఇంటి విషయాలే కాకుండా స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు.. ఇలా అందరి గురించీ మనసు విప్పి మాట్లాడుకోవాలి.

ప్రశంస, మన్నింపు: చేసిన పనులకు తగిన గుర్తింపు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కుటుంబ సభ్యులందరి క్షేమం కోసం అనుక్షణం తపించేవారి సేవలను ప్రశంసించడం మర్చిపోకూడదు. అలాగే అప్పుడప్పుడూ పొరపాట్లూ జరుగుతుంటాయి. అవి ఇద్దరిలో ఏ ఒక్కరి వల్ల జరిగినా క్షమించమని అడగడానికి అహంకారం అడ్డురాకూడదు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని