close

తాజా వార్తలు

Published : 14/07/2020 00:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇబ్బందుల్లేకుండా.. ఈ- షాపింగ్‌!

కరోనా ప్రభావంతో అమ్మాయిలంతా ఆన్‌లైన్‌ షాపింగ్‌ వైపు చూస్తున్నారు. ఇలాంటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మీ డబ్బులు, సమయం వృథానే..

దుస్తుల్ని ఆన్‌లైన్‌లో కొనాలనుకునేప్పుడు సైజ్‌ ఛార్ట్‌ చూసుకుంటాం. తీరా అవి మన దగ్గరకు వచ్చేసరికి బోలెడు సమస్యలు. కానీ ప్రతి బ్రాండ్‌కి తగ్గ కొలతలు ఉంటాయి. అన్నింటికీ ఒకటే సూత్రం పనికిరాదు. కొన్నింటిలో స్లిమ్‌ఫిట్‌ రకాలు ఉంటాయి. అవి కాస్త లావుగా ఉన్నవారికి ఏ మాత్రం పట్టవు. అందుకే గమనించుకుని కొనుక్కోవాలి.
* అసలు ఆఫ్‌లైన్‌లో దొరికే వస్తువుని ఆన్‌లైన్‌లో కొనాల్సిన అవసరం ఏంటో ఓసారి గమనించుకోండి. ఈ అంచనా వేసుకోవడం వల్ల మీ  డబ్బు, సమయం వృథా కాకుండా ఉంటాయి.
* కొన్నిసార్లు వస్తువు ధర కంటే షిప్పింగ్‌ ఛార్జీ ఎక్కువ ఉండొచ్చు. ప్రతి చిన్న వస్తువునీ షాపింగ్‌ కార్టులో వేసేయకండి. ఏ పరిమితి వరకూ ఉచిత డెలివరీ సౌకర్యం ఉందో చూసుకుని కొనుక్కోవడం వల్ల అదనపు రుసుముల బెడద నుంచి తప్పించుకోవచ్చు.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని