
తాజా వార్తలు
పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీ రద్దీ
కంచికచర్ల, చౌటుప్పల్ గ్రామీణం : సంక్రాంతి సెలవులు ముగియడంతో స్వగ్రామం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన వాహనాలతో జాతీయ రహదారిపై ఆదివారం భారీగా రద్దీ నెలకొంది. సొంత, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికులు భాగ్యనగరానికి పయనం కావడంతో ఏపీలోని కృష్ణా జిల్లా కీసర, చిల్లకల్లు.. తెలంగాణలోని చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్‌ఫ్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు కీసర టోల్ వసూలు కేంద్రం వద్ద నాలుగు వరుసలు ఉండగా, అదనంగా మరో రెండు వరుసల్లో వాహనాలను అనుమతించారు. టోల్ వసూలు కేంద్రాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
పంతంగి వద్ద 8 ఫాస్టాగ్ గేట్లను సిబ్బంది తెరిచారు. నగదు సేకరణ వరుసల్లోనూ పెద్దఎత్తున వాహనాలు బారులు తీరాయి. పంతంగి వద్ద రాత్రి 9 గంటల ప్రాంతంలో సుమారు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్గేట్ దాటేందుకు ఒక్కోవాహనానికి దాదాపు అరగంటకు పైగా సమయం పడుతోంది. వాహనాల రాకతో చౌటుప్పల్ పట్టణంలోనూ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ఇవీ చదవండి..
కర్ణాటకతో వివాదం.. ఉద్ధవ్ కీలక వ్యాఖ్యలు