ఎన్టీఆర్‌-తివిక్రమ్‌ మూవీ అప్‌డేట్‌
close

తాజా వార్తలు

Published : 31/08/2020 10:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్టీఆర్‌-తివిక్రమ్‌ మూవీ అప్‌డేట్‌

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ 30వ సినిమాగా రూపొందుతున్న దీని గురించి ఇప్పటికే ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో తాజా చిత్రం గురించి అప్‌డేట్‌ ఇవ్వాలంటూ ఫ్యాన్స్‌ నుంచి సందేశాలు వెల్లు వెత్తుతుండటంతో చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాగ వంశీ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

‘‘ఎన్టీఆర్‌ కొత్త సినిమాకు సంబంధించి అప్‌డేట్‌ ఇవ్వాలని ఫ్యాన్స్‌ నుంచి సందేశాలు వస్తున్నాయి. షూటింగ్‌ మొదలు పెట్టిన వెంటనే అందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తాం. టైటిల్‌ను ప్రకటించడం కూడా మాకు కాస్త సెంటిమెంట్‌. అందుకే చెప్పలేకపోతున్నాం. ఈసారి మాపై నమ్మకం ఉంచండి. ఒక పెద్ద విశేషాన్ని మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని ట్వీట్‌ చేశారు.

ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటిస్తున్నారు. రామ్‌చరణ్‌ మరో కథానాయకుడు. లాక్‌డౌన్‌ కారణంగా సినిమా చిత్రీకరణ తాత్కాలికంగా వాయిదా పడింది. పరిస్థితులు అనుకూలించిన వెంటనే షూటింగ్‌ మొదలు పెడతారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ చిత్రం ప్రారంభమవుతంది. హారిక-హాసిని క్రియేషన్స్‌, నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం 2021 వేసవిలో విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు మరింత ఆలస్యం అయ్యేలా ఉంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని