close

తాజా వార్తలు

Updated : 05/03/2021 12:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శ్రీవారి సేవలో వెంకయ్యనాయుడు

తిరుమల: తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న ఉప రాష్ట్రపతి స్వామివారి సేవలో పాల్గొన్నారు. సన్నిధిలో శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్న అనంతరం అర్చకులు తీర్థ శఠారితో ఆశీర్వదించారు. రంగనాయకుల మండపంలో వెంకయ్యనాయుడు దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేయగా... ఈవో జవహర్‌రెడ్డి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని