Vicky Kaushal: ఒకటి కాదు.. వెయ్యి ఆడిషన్స్‌లో రిజెక్ట్‌ చేశారు

తాజా వార్తలు

Published : 19/10/2021 02:13 IST

Vicky Kaushal: ఒకటి కాదు.. వెయ్యి ఆడిషన్స్‌లో రిజెక్ట్‌ చేశారు

కెరీర్‌ ప్రారంభంలోని అనుభవాలను పంచుకున్న బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘ విజయం అంత తేలికగా ఎవరినీ వరించదు. దానికి కోసం లెక్కలేనన్ని ప్రయత్నాలు చేయాలి. కష్టపడాలి. ఒక్కోసారి మనం అనుకున్నది సాధించకపోవచ్చు. అలాంటి సమయంలో విశ్వాసాన్ని కోల్పోకూడదు. పోరాడుతూనే ఉండాలి’’  అంటూ తన కెరీర్‌ ఆరంభంలోని అనుభవాలను గుర్తుచేసుకున్నారు బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వోసేపుర్‌’ చిత్రానికి అస్టిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి.. గీక్‌ ‘అవుట్‌’ అనే లఘు చిత్రంలో నటించి.. ఆపై సహాయనటుడిగా ‘సంజూ’లో మెప్పించి..  ‘బాంబే వెల్వెట్‌’, ‘లస్ట్‌స్టోరీస్‌’ ఇలా పలు చిత్రాల్లో నటించారు. ‘ఉరి: ది సర్జికల్‌ స్ర్టైక్‌’ సినిమా.. ఆయన జీవితంలో ఒక టర్నింగ్‌ పాయింట్‌. ఇందులో విక్కీ నటనకు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం వరించింది. ఇటీవలే ఆయన నటించిన ‘సర్దార్‌ ఉద్దమ్‌’ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదలై హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇందులో స్వాత్రంత్ర్య సమరయోధుడు ‘ఉద్దమ్‌ సింగ్‌’ పాత్రలో ఒదిగిపోయాడని విమర్శకుల ప్రశంసలు పొందారాయన. 

ఈ సందర్భంగా ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో జీవిత పాఠాలు గురించి చెబుతూ.. ‘‘ ఒక వృత్తిని ఎంచుకునే క్రమంలో మనం వందల, వేల మందితో పోటీ పడాల్సి ఉంటుంది. నటనే ప్రాణంగా భావించిన నేను సినిమాల్లో అవకాశాల కోసం రోజూ ఆడిషన్స్‌లో పాల్గొనేవాడిని. అలా 10 ఆడిషన్స్‌లో నేను ఎంపికయ్యా. నమ్ముతారో లేదో కానీ.. నన్ను 1000 ఆడిషన్స్‌లో రిజెక్ట్‌ చేశారు.  జనాలు ఎవరికీ నేను చేసిన ఈ వెయ్యి ప్రయత్నాల గురించి తెలియవు. అవకాశాలన్నీ నాకు తేలికగా వచ్చాయనుకునేవారు. నా చేతిలో ఉన్న 10 అవకాశాల్లోనే నన్ను నేను నిరూపించుకుంటూ.. ఇదిగో ఇలా మీ ముందు ఈ స్థాయిలో ఉన్నా. అందరికీ నేను చెప్పేది ఏమిటంటే.. జీవితంలో ఓ మెట్టు ఎదగాలని ప్రయత్నాలు చేస్తుంటాం. దాన్ని సాధించేంత వరకూ మీ జీవితంలో ప్రతీ రోజూ మిమల్ని మీరే ఉత్సాహరుచుకోవాలి. చేసే పనిలో ది బెస్ట్‌ ఇవ్వాలి. అప్పుడే మీలో విశ్వాసం పెరుగుతుంది. అనుకున్నది సాధించగలుగుతారు’’ అని అనుభవాలను పంచుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని