విజయవాడ దుర్గ గుడిలో విజిలెన్స్‌ సోదాలు
close

తాజా వార్తలు

Updated : 31/03/2021 21:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయవాడ దుర్గ గుడిలో విజిలెన్స్‌ సోదాలు

వెలుగులోకి వస్తున్న మరిన్ని అవకతవకలు

విజయవాడ: విజయవాడ దుర్గ గుడిలో మరిన్ని అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. నిత్యాన్నదానం కాంట్రాక్టులో అవకతవకలు జరిగాయని.. లడ్డూ, పులిహోర తయారీలో లెక్కలు తారుమారు చేసినట్లు అధికారులు తేల్చారు. దేవాదాయశాఖ కమిషనర్‌ అనుమతితో విక్రయించాల్సిన అమ్మవారి చీరలను ఆలయ ఈవో నిర్ణయంతోనే అమ్మేసినట్లు అధికారులు గుర్తించారు. గురువారం కూడా దుర్గగుడిలో విజిలెన్స్‌ సోదాలు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

గతంలో ఇంద్రకీలాద్రిపై ఐదు రోజులపాటు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) తనిఖీలు, విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఆలయంలోని కీలకమైన విభాగాలన్నింటినీ అధికారులు లోతుగా పరిశీలించారు. ఇక్కడ జరుగుతున్న అనేక లోపాలను గుర్తించిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. నివేదిక ఆధారంగా 15 మంది ఆలయ సిబ్బందిని సస్పెండ్‌ చేస్తూ దేవాదాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ పి.అర్జునరావు ఆదేశాలు జారీ చేశారు. ఆలయంలోని లడ్డూ ప్రసాదాలు, టికెట్లు‌, చీరల కౌంటర్లు, టోల్‌గేట్, కేశఖండనశాల, ప్రొవిజన్ స్టోర్, ఇంజినీరింగ్ విభాగాల్లో అవకతవకలు జరిగినట్లు అనిశా అధికారులు నివేదికలో వెల్లడించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని