విజయ్‌ దేవరకొండ 40 రోజులు పూర్తి చేశాడు..!
close

తాజా వార్తలు

Published : 08/03/2020 21:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయ్‌ దేవరకొండ 40 రోజులు పూర్తి చేశాడు..!

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటుడు విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఫైటర్‌’ (పరిశీలనలో ఉంది). బాలీవుడ్‌ నటి అనన్యా పాండే కథానాయికగా నటిస్తున్నారు. పాన్‌ ఇండియన్‌ సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ముంబయిలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. కాగా 40 రోజుల షూటింగ్‌ పూర్తయిందని చిత్ర బృందం ఆదివారం ప్రకటించింది. సినిమాలోని కీలకమైన సన్నివేశాల్ని చిత్రీకరించినట్లు చెప్పింది. విజయ్‌, అనన్య, రమ్యకృష్ణ, రోనిత్‌ బోస్‌ రాయ్‌, అలీకి మధ్య సాగే కొన్ని సన్నివేశాల్ని ముంబయిలో తీసినట్లు తెలిపింది.

ఈ చిత్రాన్ని కరణ్‌ జోహార్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యాక్షన్‌ నేపథ్యంలో సాగే ప్రేమ కథగా రాబోతున్న ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ థాయ్‌లాండ్‌ వెళ్లి మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారట. ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ తర్వాత విజయ్‌ నటిస్తున్న సినిమా ఇది. ఆయన, పూరీ కాంబినేషన్‌  కావడంతో అంచనాలు నెలకొన్నాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని