ట్విటర్‌లో విజయసాయి, సోము వ్యంగ్యాస్త్రాలు
close

తాజా వార్తలు

Published : 29/03/2021 14:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్విటర్‌లో విజయసాయి, సోము వ్యంగ్యాస్త్రాలు

అమరావతి: తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసురుకున్నారు. తొలుత విజయసాయి.. భాజపా నేతలపై విమర్శలు చేశారు. దీనిపై సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. భాజపా డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారని విజయసాయి ట్వీట్‌ చేయగా.. దీనికి స్పందించిన సోము వీర్రాజు తాము రాష్ట్రానికి ఏం ఇచ్చామో చెప్పి ఎన్నికల్లో గెలుస్తామన్నారు. కోర్టులను తప్పుదోవ పట్టించి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. గెలిచిన తర్వాత విజయసాయికి క్యాబేజీ పూలు పంపిస్తామని.. బెయిల్‌ రద్దవగానే జైలులో కూరకు అవి పనికొస్తాయని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. 

మరోవైపు తిరుపతి ఉప ఎన్నిక బరిలో వైకాపా నుంచి గురుమూర్తి, భాజపా- జనసేన అభ్యర్థిగా రత్నప్రభ ఇవాళ నామినేషన్‌ దాఖలు చేశారు. తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని