సమసిన విజయవాడ తెదేపా నేతల వివాదం
close

తాజా వార్తలు

Updated : 06/03/2021 16:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమసిన విజయవాడ తెదేపా నేతల వివాదం

అమరావతి: విజయవాడ తెలుగుదేశం నేతల మధ్య వివాదం సద్దుమణిగింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు జోక్యంతో నేతల మధ్య నెలకొన్న వివాదం సమసిపోయింది. విజయవాడలో తెదేపా నేతల మధ్య తలెత్తిన విభేదాలపై తెలిసిన వెంటనే అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి సమస్య పరిష్కారంపై దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేరకు నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనార్దన్, వర్ల రామయ్యలు మాట్లాడారు. విజయవాడ తెదేపా మేయర్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన కేశినేని శ్వేతకు మద్దతిస్తూ, ఆమె వెంటే ఉంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని నేతలు హామీ ఇచ్చారు. ఆమె విజయానికి కృషి చేస్తామని ముగ్గురు నేతలు వెల్లడించారు.

బొండా ఉమ ఇంటికి కేశినేని శ్వేత..

నేతల మధ్య నెలకొన్న వివాదం సమసిన కొన్ని గంటల వ్యవధిలోనే విజయవాడ తెదేపా మేయర్‌ అభ్యర్థి కేశినేని శ్వేత.. బొండా ఉమ ఇంటికి వెళ్లారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో తనకు సహకరించాల్సిందిగా బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలను కోరారు. శ్వేతతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని మీడియాతో మాట్లాడుతూ నేతలు స్పష్టం చేశారు. విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో పర్యటించి.. తెదేపా అభ్యర్థి విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. మేయర్‌ అభ్యర్థి విజయానికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని