నాలుగేళ్ల ప్రాయం.. నాలుగు రికార్డులు
close

తాజా వార్తలు

Published : 17/02/2021 21:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాలుగేళ్ల ప్రాయం.. నాలుగు రికార్డులు

నిమిషంలో 137 ఆంగ్ల పదాలను చదివిన ఎల్‌కేజీ చిన్నారి

అమరావతి: ఎల్‌కేజీ చదివే పాపాయి నిమిషానికి 130కి పైగా ఆంగ్ల పదాలు చకచకా చెప్పేస్తోంది. నాలుగేళ్ల ప్రాయంలోనే ఏకంగా నాలుగు ప్రతిష్టాత్మక రికార్డులను సొంతం చేసుకుంది. భయం, బెరుకు, తడబాటు లేకుండా అన్ని పదాలను వేగంగా చదివేస్తోంది. ఏవిషయాన్నైనా చెబితే ఇట్టే అర్థం చేసుకునే విజయవాడకు చెందిన అన్షు ఆద్య నిమిషంలో 137 ఆంగ్ల పదాలు, మరో నిమిషంలో 60 ర్యాండమ్‌ పదాలను చదివి అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. ఈ చిన్నారి ఆంగ్ల పదాలను వేగంగా చదువుతున్న వీడియోలను చూసి వండర్‌ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌, జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, వరల్డ్‌ రికార్డ్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియాస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష నిర్వహించారు. అందులో నెగ్గిన ఈ నాలుగేళ్ల చిన్నారి ఆ నాలుగు సంస్థల నుంచి అవార్డులు దక్కించుకుంది.

అన్షు ఆద్య తండ్రి కొనగళ్ల ఉమామహేశ్వరరావు విజయవాడలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. తల్లి వైశాలి. మాటలు పలికే ప్రాయంలోనే తల్లిదండ్రులు చిన్నారిలోని ప్రతిభను గుర్తించారు. చిన్నప్పటినుంచే ఏబీసీడీలు సహా పదాలను కచ్చితత్వంతో పలికేలా పొనెటిక్స్ నేర్పడంతో ఆ పాపాయి చకచకా పదాలను చదివేస్తోంది. ఎల్‌కేజీ చదువుతున్న వయసులోనే ప్రతిభ చాటుతున్న ఆద్య భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించేలా శిక్షణ ఇప్పిస్తామని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని