విశాఖలో చోరీ కేసు ఛేదించిన పోలీసులు
close

తాజా వార్తలు

Updated : 21/01/2021 13:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విశాఖలో చోరీ కేసు ఛేదించిన పోలీసులు

విశాఖ: గత ఏడాది డిసెంబర్‌ 24న విశాఖ సాయిప్రియ రిసార్ట్స్‌లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రిసార్ట్స్‌లో జరిగిన పెళ్లి వేడుకలో 53 తులాల బంగారం అపహరించినట్లు గుర్తించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దొంగను పట్టుకున్నారు. నిందితుడిని విజయవాడకు చెందిన ఓ అనాథగా పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను విశాఖ పోలీసు కమిషనర్‌ మనీశ్ కుమార్‌ సిన్హా మీడియాకు వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్‌ 8న జైలు నుంచి విడుదలైన నిందితుడు చాలా చోట్ల చోరీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడని సీపీ చెప్పారు. చాలా రోజులుగా విశాఖలో ఉంటున్న నిందితుడు ఇప్పటికే పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించినట్లు సీపీ వెల్లడించారు.

ఇవీ చదవండి..

కేటీఆర్‌ సీఎం అయితే తప్పేంటి?: తలసాని

కమలా హారిస్‌ ప్రమాణం: తమిళనాడులో సంబరాలు!Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని