అరకు ప్రమాదం.. హైదరాబాద్‌కు‌ మృతదేహాలు
close

తాజా వార్తలు

Updated : 14/02/2021 16:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అరకు ప్రమాదం.. హైదరాబాద్‌కు‌ మృతదేహాలు

హైదరాబాద్‌: విశాఖ జిల్లా అరకు సమీపంలోని డుముకు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయినవారి మృతదేహాలు హైదరాబాద్‌లోని షేక్‌పేటకు చేరుకున్నాయి. ప్రమాదంలో చనిపోయిన సత్యనారాయణ, సరిత, లత, చిన్నారి శ్రీనిత్య మృతదేహాలతో పాటు 16 మంది క్షతగాత్రులను ఆంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. మరో ఎనిమిది మంది విశాఖలోని కేజీహెచ్‌లో చికిత్స పొందున్నారు. చికిత్స పొందుతున్న వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని బాధితుల కుటుంబసభ్యులు తెలిపారు. మృతదేహాలు, క్షతగాత్రులు షేక్‌పేటకు చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాద విషయం తెలిసినప్పటి నుంచి కుటుంబసభ్యులు, బంధువులు సత్యనారాయణ ఇంటివద్దే ఉంటున్నారు. మృతదేహాలు సత్యనారాయణ ఇంటివద్దకు చేరుకోవడంతో బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. పాతబస్తీలోని నివాసానికి మృతురాలు నల్ల లత మృతదేహాన్ని తరలించారు. కాసేపట్లో సత్యనారాయణ, సరిత, శ్రీనిత్య మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

సరైన చికిత్స అందించలేదు..
విశాఖ కేజీహెచ్‌లో సరైన చికిత్స అందించడం లేదని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను హైదరాబాద్‌కు తరలిస్తే సొంత ఖర్చులతో చికిత్స చేయించుకుంటామని అంటున్నారు. ఈ మేరకు మీడియా ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బాధిత కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు.

చెప్పిన 30 సెకన్లకే దూకేశాడు: బాధితుడు నరేశ్‌
‘‘అరకు వద్ద బస్సు లోయలో పడేందుకు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణం‌. లోయలో పడే కొన్ని క్షణాల ముందు బస్సు బ్రేకులు ఫెయిల్‌ అయినట్లు డ్రైవర్‌ చెప్పాడు. తర్వాత అతడు బస్సు నుంచి కిందకు దూకేశాడు. విశాఖలో అరకు ప్రాంతానికి వెళ్తున్నామని.. ఘాట్‌రోడ్డులో బస్సు నడిపే అనుభవం ఉన్న డ్రైవర్‌ను పంపించాలని ట్రావెల్స్‌కి చెప్పాం. సరే అన్నారు.. కానీ, ఘాట్‌రోడ్డులో నడిపిన అనుభవం లేని డ్రైవర్‌ను పంపించారు’’ అని బాధితుడు వాపోయాడు.

ఇవీ చదవండి..

అరకు ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం: 14 మంది మృతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని