సందర్శకులపై దాడికి యత్నించిన ఏనుగులు
close

తాజా వార్తలు

Published : 16/03/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సందర్శకులపై దాడికి యత్నించిన ఏనుగులు

బెంగళూరు: కర్ణాటకలోని కె.గుడిలో రెండు ఏనుగులు సందర్శకుల జీపుపై దాడి చేసేందుకు యత్నించాయి. చామరాజ్‌నగర్‌లోని బిలీరంగనబెట్ట టైగర్‌ రిజర్వ్‌లో కె.గుడి సఫారీ కోసం కొందరు సందర్శకులు జీపులో బయలుదేరారు. కాగా దారిలో వారిని రెండు ఏనుగులు కాసేపు ఆందోళనకు గురిచేశాయి. ఓ ఏనుగు జీపు వెనక పరుగెత్తుకొని దాడి చేసేందుకు రాగా మరో గజరాజు ముందునుంచి దాడికి యత్నించింది. జీపు డ్రైవర్‌ సమయోచితంగా వ్యవహరించి ముందున్న ఏనుగును బెదిరించడంతో అది వెనక్కి తగ్గింది. వెంటనే అక్కడి నుంచి జీపును ముందుకు పోనివ్వడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. జీపు డ్రైవర్‌కు సందర్శకులు కృతజ్ఞతలు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని