విచారణ నెలరోజులు వాయిదా వేయండి: రేవంత్‌
close

తాజా వార్తలు

Updated : 09/03/2021 04:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విచారణ నెలరోజులు వాయిదా వేయండి: రేవంత్‌

హైదరాబాద్‌: ఓటుకు నోటు కేసు విచారణ ప్రక్రియను నెలరోజుల పాటు వాయిదా వేయాలని నిందితుడిగా ఉన్న ఎంపీ రేవంత్‌రెడ్డి ఏసీబీ కోర్టును కోరారు. పార్లమెంట్‌ సమావేశాలు ఉన్నందున ఏప్రిల్‌ 8 వరకు విచారణ వాయిదా వేయాలని కోరుతూ ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఏసీబీ సమర్పించిన హార్డ్‌ డిస్క్‌, సీడీల్లోని సమాచారం ల్యాప్‌టాప్‌లో తెరుచుకోవడం లేదని రేవంత్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ సమాచారాన్ని తాము అందిస్తామని ఏసీబీ ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చెప్పారు. నెలరోజులపాటు విచారణను వాయిదా వేయాలన్న రేవంత్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేస్తామని ఏసీబీ తరఫు ప్రత్యేక పీపీ తెలపడంతో విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని