TS: ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ విడుదల
close

తాజా వార్తలు

Updated : 12/08/2020 20:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS: ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ విడుదలైంది. 2021 జనవరి ఒకటి అర్హత తేదీతో ఓటర్ల జాబితా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ వెల్లడించారు. అక్టోబర్‌ నెలాఖరు వరకు ప్రీరివిజన్‌, పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ, డూప్లికేట్‌ ఓట్ల తొలగింపు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. నవంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేస్తామన్నారు. డిసెంబర్‌ 12 వరకు అభ్యంతరాలు, వినతులకు గడువునిచ్చారు. ‘‘2021 జనవరి 15న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తాం. ఆ ఏడాది జనవరి ఒకటి నాటికి 18 ఏళ్ల వయసు ఉన్నవారికి కొత్తగా ఓటు హక్కు కల్పిస్తాం. www.nvsp.in ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఓటుహక్కు కోసం దరఖాస్తు  చేసుకోవచ్చు’’అని శాశంక్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని