రోహిత్‌ను ఆడించకపోవడం అర్థం చేసుకుంటా.. కానీ!
close

తాజా వార్తలు

Published : 13/03/2021 22:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోహిత్‌ను ఆడించకపోవడం అర్థం చేసుకుంటా.. కానీ!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మను ఎందుకు ఆడించలేదనే విషయాన్ని అర్థం చేసుకుంటానని, అయితే.. భారత్‌ ఈ పొట్టి సిరీస్‌ గెలవాలంటే అత్యుత్తమ 11 మందితో ఆడాలని హైదరాబాద్‌ సొగసరి బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ క్రీడా ఛానల్‌లో పార్థివ్‌ పటేల్‌తో మాట్లాడిన ఈ మాజీ బ్యాట్స్‌మన్‌ ఆ వ్యాఖ్యలు చేశాడు.

తొలి టీ20లో టీమ్‌ఇండియా ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దించింది. పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయిందా? అని పార్థివ్‌ అడగడంతో లక్ష్మణ్‌ ఇలా చెప్పుకొచ్చాడు. ‘టీమ్‌ఇండియా, విరాట్‌ కోహ్లీ అనుకుంటున్నట్లు సిరీస్ గెలవాలంటే అత్యుత్తమ 11 మందితో బరిలోకి దిగాలి. రోహిత్‌ శర్మను ఆడించకపోవడం అర్థం చేసుకుంటాను. ఎందుకంటే శిఖర్‌ధావన్‌, కేఎల్‌ రాహుల్‌ అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్‌. కానీ, ఇంగ్లాండ్‌తో ఆడేటప్పుడు సరైన కాంబినేషన్‌తో ఆడకపోతే వాళ్లు తెచ్చే ఒత్తిడిని తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇంగ్లాండ్‌ జట్టులోనూ మంచి అనుభవజ్ఞులు ఉన్నారు’ అని తన అభిప్రాయం వెల్లడించాడు.

టెస్టు సిరీస్‌ అనేది ప్రత్యేకమని, అక్కడ టీమ్‌ఇండియాకు అనుకూలంగా వికెట్లు ఉన్నాయని లక్ష్మణ్‌ అన్నాడు. అలాగే అప్పుడు ఇంగ్లిష్‌ జట్టులో సరైన బ్యాట్స్‌మన్‌ లేరని, ఇప్పుడు పొట్టి క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారన్నాడు. ఈ క్రమంలోనే నాణ్యమైన ఆటగాళ్లతో ఆడకపోతే కష్టాలు తప్పవని వీవీఎస్‌ చెప్పాడు. ఇదిలా ఉండగా, పేస్‌కు అనుకూలించే పిచ్‌పై టీమ్‌ఇండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. మరోవైపు ఇంగ్లాండ్‌ ముగ్గురు ప్రధాన పేసర్లతో తొలి పోరులో తలపడింది. ఈ నేపథ్యంలోనే ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని