ఐపీఎల్‌కు డేవిడ్‌ వార్నర్‌ దూరం?
close

తాజా వార్తలు

Published : 22/02/2021 20:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐపీఎల్‌కు డేవిడ్‌ వార్నర్‌ దూరం?

ఇంటర్నెట్‌డెస్క్: గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి మరో ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని, త్వరగా కోలుకునే అవకాశం ఉందని తెలిపాడు. ‘‘గత కొన్ని వారాలుగా త్రో వేయడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. అయితే వచ్చే వారం నుంచి త్రో వేయడం ప్రారంభిస్తా. ప్రస్తుతం వికెట్ల మధ్య పరిగెత్తడమే ప్రధాన సమస్య. కోలుకోవడానికి మరో ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పట్టే అవకాశం ఉంది. చికిత్సతో త్వరగా గాయాన్ని అధిగమిస్తానని ఆశిస్తున్నా’’ అని వార్నర్‌ పేర్కొన్నాడు.

మరో రెండు నెలల్లో ఐపీఎల్‌-14వ సీజన్‌ ప్రారంభం కానుండటంతో.. గాయంతో వార్నర్‌ ఐపీఎల్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు వార్నర్‌ సారథిగా బాధ్యతలు వహిస్తున్నాడు. హైదరాబాద్‌ జట్టులో వార్నర్‌ ప్రధాన ఆటగాడు. కాగా, భారత్‌తో జరిగిన రెండో వన్డేలో వార్నర్‌ గాయపడిన సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ చేస్తుండగా గజ్జల్లో గాయమవ్వడంతో నొప్పితో విలవిలలాడుతూ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత టీ20 సిరీస్‌కు దూరమైనా, టెస్టు సిరీస్‌లో తిరిగొచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమయ్యాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని