CSK: జడేజాను అనుకరించిన ధోనీ..!
close

తాజా వార్తలు

Published : 18/05/2021 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

CSK: జడేజాను అనుకరించిన ధోనీ..!

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అంటే మైదానంలో మెరుపు ఫీల్డింగే కాదు.. కొత్త కొత్త విన్యాసాలు గుర్తొస్తాయి. అతడు ఏ మ్యాచ్‌లో రాణించినా బ్యాట్‌ను కత్తి తిప్పినట్లు తిప్పి అటు సహచర ఆటగాళ్లను.. ఇటు అతడి అభిమానులను అలరిస్తాడు. ఎన్నో సందర్భాల్లో అతడి నుంచి ఇలాంటి ప్రదర్శనలు ప్రత్యక్ష ప్రసారాల్లో మనం కచ్చితంగా చూసే ఉంటాం. అయితే, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ తాజాగా జడేజాను అనుకరించాడు.

జడ్డూ మైదానంలో ఎలాగైతే ఒంటిచేత్తో బ్యాట్‌ను తిప్పుతాడో అలాగే మహీ బ్యాట్‌ లేకుండానే ఖాళీ చేతిని అచ్చం అలాగే తిప్పి అందర్నీ అలరించాడు. ఆ వీడియోను సీఎస్కే జట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా.. దానికి విశేషమైన స్పందన వచ్చింది. 24 గంటల్లో 7లక్షల మందికిపైగా వీక్షించారు. ఈ క్రమంలోనే ఆ వీడియో చూసిన జడేజా.. వచ్చేసారి తన కెప్టెన్‌ను బ్యాట్‌తో ప్రయత్నించాలని కామెంట్‌ చేశాడు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని