Viral Video: మోదీజీ షేర్‌చేసిన జింకల వీడియో చూశారా!

తాజా వార్తలు

Published : 29/07/2021 18:03 IST

Viral Video: మోదీజీ షేర్‌చేసిన జింకల వీడియో చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుజరాత్ భావ్‌నగర్‌లోని ఓ రహదారిపై జింకలు సందడి చేశాయి. వేలాది సంఖ్యలో జింకలు ఒకేసారి రోడ్డు దాటుతూ స్థానికులకు కనువిందు చేశాయి. జింకలు ఒకదాని వెంట మరొకటి వరుసగా రోడ్డు దాటుతున్న దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. వేలావదర్  జాతీయ జింకల పార్క్ నుంచి సుమారు 3,000 పైగా జింకలు ఒకేసారి రహదారిపైకి వచ్చినట్లు అటవీ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలను ‘గుజరాత్ ఇన్ఫర్మేషన్‌’ ట్విటర్‌ ద్వారా పంచుకోగా..  ప్రధాన మంత్రి మోదీ ‘ఎక్సలెంట్‌’ అనే శీర్షికను జత చేసి రీట్వీట్‌ చేశారు. దాంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది. 
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని