పంత్‌ స్పైడర్‌ మ్యాన్‌.. పాండ్య సెల్ఫీమ్యాన్‌
close

తాజా వార్తలు

Published : 20/02/2021 11:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పంత్‌ స్పైడర్‌ మ్యాన్‌.. పాండ్య సెల్ఫీమ్యాన్‌

(Pic: Hardik Pandya Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌పంత్‌ మరోసారి స్పైడర్‌మ్యాన్‌గా వార్తల్లో నిలిచాడు. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టుకు ముందు మొతేరా స్టేడియంలో ప్రాక్టీస్‌ చేస్తున్న సందర్భంగా అతడు స్పైడర్‌మ్యాన్‌లా మారిపోయాడు. మిగతా ఆటగాళ్లు జిమ్‌లో శారీరక కసరత్తులు చేస్తుంటే పంత్‌ నేలపై పాకుతూ వెళ్లాడు. అందుకు సంబంధించిన వీడియోను కొత్త ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఆ వీడియోకు స్పైడర్‌ మ్యాన్‌ థీమ్‌సాంగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌గా సెట్‌చేశారు.

కాగా, పంత్‌ ఇలా స్పైడర్‌మ్యాన్‌గా వార్తల్లోకెక్కడం ఇదేం తొలిసారి కాదు. గతనెల ఆస్ట్రేలియాతో తలపడిన బ్రిస్బేన్‌ టెస్టులోనూ నాలుగో రోజు మైదానంలోనే స్పైడర్‌మ్యాన్‌ హిందీ పాట పాడాడు. కీపింగ్‌ చేస్తున్నప్పుడు అతడు ఈ పాట అందుకోవడంతో అది స్టంప్‌మైక్‌లో వినిపించింది. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పుడు తాజాగా మరోసారి పంత్‌ స్పైడర్‌మ్యాన్‌లా చేయడం గమనార్హం. మరోవైపు హార్దిక్‌ పాండ్య మొతేరా స్టేడియంలో సెల్ఫీ తీసుకొని సంతోషం వ్యక్తం చేశాడు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంగా ఇటీవలే దీన్ని ఆధునిక వసతులతో అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఈ మైదానం ఎంతో చూడముచ్చటగా ఉందని పాండ్య పేర్కొన్నాడు. అలాగే జిమ్‌లో తీసుకున్న ఫొటోలు కూడా అభిమానులతో పంచుకున్నాడు.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని