కాపలా పెడితే.. కత్తితో హడలెత్తించాడు!
close

తాజా వార్తలు

Published : 28/03/2021 11:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాపలా పెడితే.. కత్తితో హడలెత్తించాడు!

విజయవాడ: విజయవాడ నగర శివారు నున్న మామిడికాయల మార్కెట్‌ సమీపంలోని ఓ అపార్టెమెంట్‌లో వాచ్‌మెన్‌ వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో కత్తి పట్టుకుని అపార్ట్‌మెంటు వాసులను హడలెత్తించాడు. గత కొంతకాలంగా అపార్టమెంట్‌లో పనికి కుదిరిన రాంబాబు.. మద్యానికి బానిసై ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. పద్దతి మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోగా మద్యం సేవించి అపార్ట్‌మెంట్‌ వద్ద హంగామా సృష్టించాడు. సమాచారమందుకున్న నున్న పోలీసులు రాంబాబును అదుపులోకి తీసుకోవడంతో అపార్ట్‌మెంట్‌ వాసులు ఊపిరిపీల్చుకున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని