close

తాజా వార్తలు

Published : 19/10/2020 02:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వాటర్‌ ట్యాక్సీలను ప్రారంభించిన కేరళ

(ప్రతీకాత్మక చిత్రం)

ఇంటర్నెట్ డెస్క్‌: మీరు ఎప్పుడైనా వాటర్ ట్యాక్సీల గురించి విన్నారా? రోడ్డు ప్రయాణాల్లో భాగంగా ట్యాక్సీల గురించి విన్నాం, కానీ ఈ వాటర్‌ ట్యాక్సీలేంటి? అనుకుంటున్నారా? పడవ ప్రయాణాలు చేసే ప్రజలు, పర్యాటకుల కోసం కేరళ మొట్టమొదటి సారిగా ఈ ట్యాక్సీలను ప్రారంభించింది. ప్రయాణీకుల సౌకర్యార్థం అలప్పుజ, ఫెర్రిడ్‌ బ్యాక్‌ వాటర్‌లో దీనిని ప్రారంభించారు. ఈ ట్యాక్సీ సేవలలో కాటమెరన్‌ డీజిల్‌ పవర్డ్‌ క్రాప్ట్‌లను ఉపయోగించనున్నారు. వీటిలో పదిమంది ప్రయాణించవచ్చు. స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఎస్‌డబ్ల్యూటీడీ) ఈ సేవలలో ప్రస్తుతం నాలుగు క్రాప్ట్‌లను ఉపయోగించాలని ప్రణాళికలు వేస్తోంది. సేవలకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తరవాత క్రాప్ట్‌లను ఆర్డర్‌ చేసింది ఎస్‌డబ్ల్యూటీడీ. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించటంతో పాటు, అలప్పుజ చుట్టుపక్కల ప్రాంతాల్లో  నివసిస్తూ, ప్రయాణాల కోసం పడవలపై ఆధారపడే వారికీ ఈ వాటర్‌ ట్యాక్సీల సేవలు అందుబాటులో ఉంటాయి. కేరళలో ఉన్న ప్రధాన పర్యాటక ప్రదేశాలలో అలప్పుజ బ్యాక్ వాటర్‌ ప్రాంతం  ప్రసిద్ధి గాంచింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.