close

తాజా వార్తలు

Published : 23/05/2020 08:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆరేళ్లు ఆ గదిలోకి వెళ్లలేదు..!

అర్జున్‌ కపూర్‌

ముంబయి: జీవితంలో ఎంత సాధించినా తన తల్లి మోనా లేని లోటు ఎప్పటికీ అలాగే ఉంటుందని బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌ తెలిపారు. ‘ఇష్క్‌జాదే’ సినిమాతో అర్జున్‌ హీరోగా వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలకు కొన్నిరోజుల ముందు క్యాన్సర్‌తో పోరాడుతున్న మోనా 2012లో కన్నుమూశారు. తన తల్లి మృతిచెందిన నాటి నుంచి ఇప్పటికీ ఆమెను ఎంతో మిస్‌ అవుతున్నానని అర్జున్‌ అన్నారు.

‘అమ్మ మృతి చెంది ఎనిమిదేళ్లు అవుతోంది. చాలా సందర్భాల్లో ఆమెను నేను బాగా మిస్‌ అవుతున్నాను. ఆమె మరణం నా జీవితంలో అతిపెద్ద లోటు. ఆమె మృతి చెందిన తర్వాత ఆరేళ్లపాటు నేను, నా సోదరి అన్షూల్లా ఆమె గదిలోకి వెళ్లలేదు. నా దృష్టిలో అమ్మ మా మధ్యే ఉందనిపిస్తుంది. రోజంతా షూటింగ్స్‌తో బిజీగా ఉండి ఇంటికి వెళ్లేసరికి అందరిలానే నాకు కూడా కొంచెం చిరాకుగా అనిపిస్తుంది. అయితే ఆ రోజంతా నా జీవితంలో ఏం జరిగిందో చెప్పడానికి అమ్మ నా పక్కన లేదని ఎన్నోసార్లు బాధపడ్డా. ఆ సమయంలో నా జీవితం అసంపూర్ణంగా ఉన్నట్లు అనిపిస్తుంది. జీవితంలో ఎంత సాధించినా అమ్మలేని లోటు ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది’ అని అర్జున్‌ కపూర్‌ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన