‘‘తెలంగాణలో అత్యుత్తమ టెక్స్‌టైల్‌ విధానం’’
close

తాజా వార్తలు

Published : 06/07/2020 19:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘‘తెలంగాణలో అత్యుత్తమ టెక్స్‌టైల్‌ విధానం’’

ఇన్వెస్ట్ ఇండియా కార్యక్రమంలో కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణలో టెక్స్‌టైల్‌ రంగంలో పెట్టబడులకు అవకాశాలున్నాయని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. టెక్స్‌టైల్, అపరెల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సులో నిర్వహించిన ఇన్వ్‌స్ట్ ఇండియా కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడారు. ‘‘టెక్స్‌టైల్ పెట్టుబడులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్‌ తెలంగాణలో ఉంది. రాష్ట్రంలో అత్యుత్తమ టెక్స్‌టైల్‌ విధానం అమలు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి టెక్స్‌టైల్, అపరెల్‌ ప్రాధాన్య రంగాలు. టెక్స్‌టైల్‌ పరిశ్రమకు కావాల్సిన విద్యుత్తు, నీటి సరఫరా అందిస్తాం’’ అని కేటీఆర్‌ తెలిపారు. టెక్స్‌టైల్‌ రంగంలో తెలంగాణ ప్రభుత్వ విధానాలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశంసించారు. గత ఆరేళ్లుగా తనదైన విధానాలతో తెలంగాణ పెట్టుబడులకు ఆకర్షిస్తోందని స్మృతి ఇరానీ కొనియాడారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని