కొవిడ్‌ కట్టడికి మిలటరీ కావాలి: సోరెన్‌
close

తాజా వార్తలు

Published : 19/04/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ కట్టడికి మిలటరీ కావాలి: సోరెన్‌

రాంచీ: దేశ వ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతంగా వ్యాపిస్తున్న వేళ ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాప్తి అధికంగా ఉందని, దీనిని అదుపు చేసేందుకు మిలటరీ బలగాలు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాణాంతక స్థితిలో వైరస్‌ వ్యాప్తి చెందుతున్నా ప్రజల్లో భయం లేకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

‘‘కొవిడ్‌ వ్యాప్తిపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లకు ప్రభుత్వం తరఫున లేఖలు రాస్తాం. వైరస్‌ విస్తృతిని అరికట్టేందుకు కేంద్ర బలగాలను ఝార్ఖండ్‌లో మోహరించాలని కోరతాం.’’అని సోరెన్‌ మీడియాకు వివరించారు. గడిచిన 24 గంటల్లో ఝార్ఖండ్‌లో కొత్తగా 3,838 కేసులు నమోదయ్యాయి. 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.6 లక్షల మందికి కరోనా సోకగా.. 1,341 మంది మృతి చెందారు.

‘‘ఇటీవల ఓ ఉపఎన్నికల ప్రచారం కోసం వెళ్లాను. ప్రజలను చూసి షాక్‌కు గురయ్యాను. ఎవరూ మాస్క్‌లు ధరించడం లేదు.భౌతిక దూరాన్ని పాటించడం లేదు. వాళ్లకు కరోనా వైరస్‌ అంటేనే అసలు భయం లేదు.అందువల్ల వీరందరికీ ఓ గట్టి సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే కేంద్రానికి లేఖ రాయబోతున్నాను’’ అని సొరేన్‌ మీడియాకు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని