close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120042512 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => 2_BkCz3OnlY [video_short_link] => 2_BkCz3OnlY [created_by] => [created_date] => [modified_by] => 9030378 [modified_date] => 2020-03-31 08:36:08.030857 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

తారక్‌-చెర్రీలతో చిత్రాన్ని భారంగా భావించలేదు

ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంజాయ్‌ చేయాలి

హైదరాబాద్‌: అభిమానులు తమ స్టార్స్‌ సినిమాల్ని ఎంజాయ్‌ చేస్తారని, కానీ సాధారణ ప్రేక్షకులు కూడా సినిమాను ఇష్టపడేలా తీయాలని ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి చెప్పారు. ఆయన తాజాగా ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇటీవల విడుదల చేసిన ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ మోషన్‌ పోస్టర్‌ గురించి ముచ్చటించారు. కరోనా వైరస్‌ ప్రభావం ఇంతలా ఉంటుందని ఎవరూ ఊహించలేదని పేర్కొన్నారు.

‘‘ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్ని ముందే ఎవరూ ఊహించలేదు. అంతా ఉన్నట్లుండి జరిగింది. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ షూటింగ్‌ షెడ్యూల్‌ ప్రకారం జరుగుతోంది. చివరి దశకు వచ్చింది. అంతా బాగా జరుగుతున్న సమయంలో కరోనా మన భారత్‌కు వచ్చింది. సామాజిక దూరం పాటించాల్సిన పరిస్థితి. రెండు రోజుల్లోనే సినిమా షూటింగ్‌ ఆపేయాల్సి వచ్చింది. ఆపై నలుగురు ఆఫీసుకు వెళ్లి సినిమా పనులు చూసేవారు. ఇప్పుడు ఇంటిలో కూర్చుని పనిచేస్తున్నాం. ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ విధించడం, ఆపై 21 రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించడం.. అంతా అకస్మాత్తుగా జరిగాయి. వైరస్‌ నియంత్రణకు ఇలా చేయడం మంచిదే’’

‘‘నా మైండ్‌ సగం కరోనా ఆలోచనలతో నిండిపోయింది. మిగిలిన సగం.. చరణ్‌ పుట్టినరోజు వస్తోంది. దానికి ముందే మోషన్‌ పోస్టర్‌ విడుదల చేయాలి. మనం చేయగలమా? లేదా?.. ఈ ఆలోచనలతో ఉన్నా. మోషన్‌ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. మన క్రియేటివిటీని ప్రజల ముందుకు తీసుకొచ్చినప్పుడు వాళ్లు ప్రశంసిస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అది గొప్ప ఫీలింగ్‌’’

‘‘మా సినిమాలో తారక్‌, చరణ్‌లాంటి ఇద్దరు స్టార్స్‌ ఉన్నారు. మనం థియేటర్‌కు వెళితే ఫ్యాన్స్‌ తక్కువగా ఉంటారు.. ప్రేక్షకులు ఎక్కువగా ఉంటారు. అభిమానులు కేకలు వేస్తూ సినిమాను ఎంజాయ్‌ చేస్తారు. కానీ, ప్రేక్షకులు ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారు, వారి అభిప్రాయాలు ఏంటని గమనించాలి. ఇప్పుడు సాధారణ ప్రజలు సైతం మా మోషన్‌ పోస్టర్‌ను ఇష్టపడ్డారు. అందుకు హ్యాపీగా ఉంది’’

‘‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో ఇద్దరు హీరోలు ఉన్నారు. వారికి ఎక్కువ మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అలాగని వారితో సినిమా తీయడాన్ని భారంగా భావించలేదు. నా చిన్నతనంలో కామిక్‌ పుస్తకాలు చదివినప్పుడు సూపర్‌మ్యాన్‌, స్పైడర్‌ మ్యాన్‌ లాంటి ఇద్దరు హీరోలు కలిస్తే బాగుంటుందనే ఆలోచనలు ఉండేవి. ఇప్పుడు ఈ సినిమాకు అలా అన్నీ కలిసి వచ్చాయి. చరణ్‌, ఎన్టీఆర్‌ మంచి స్నేహితులు. ఇప్పుడు సినిమాకు వారి బంధం ఉపయోగపడుతోంది’’ అని జక్కన్న చెప్పారు. 

‘ఆర్‌.ఆర్‌.ఆర్’లో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమరం భీమ్‌గా తారక్‌ నటిస్తున్నారు. అలియా భట్‌, ఒలివియా మోరిస్‌ కథానాయికలు. 2021 జనవరి 8న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

 

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.