మేం భయపడలేదు: కోహ్లీ
close

తాజా వార్తలు

Updated : 17/02/2021 02:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మేం భయపడలేదు: కోహ్లీ

ఇంటర్నెట్‌డెస్క్‌: చెపాక్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో తమ జట్టు ధైర్యాన్ని, సంకల్పాన్ని చూపించిందని టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ అన్నాడు. పర్యాటక జట్టుపై భారత్‌ 317 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ చెపాక్‌ పిచ్‌పై వస్తున్న విమర్శలను ఖండించాడు.

‘‘బంతి టర్న్‌, బౌన్స్‌ అవ్వడంపై మేమేం భయపడలేదు. ఆటలో మా ధైర్యాన్ని ప్రదర్శించాం. 600 పరుగులు సాధించాం. పరుగులు సాధిస్తే మా బౌలర్లు మిగిలిన పనిని పూర్తిచేస్తారని తెలుసు. రెండో ఇన్నింగ్స్‌లోనూ మేం దాదాపు 300 పరుగులు సాధించాం. ఇక్కడ టాస్‌ కీలకం అనుకోవట్లేదు. స్పిన్‌/సీమ్ ట్రాక్‌పై తొలి సెషన్‌ నుంచే ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉండాలి. ఇక్కడ అలానే జరిగింది’’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

టీమిండియా భారీ విజయం సాధించడంలో అభిమానులు కీలక పాత్ర పోషించారని కోహ్లీ అన్నాడు. ‘‘స్వదేశంలో అభిమానులు లేకుండా ఆడటం వింతగా అనిపించింది (తొలి టెస్టు గురించి). అంతేగాక ఆ మ్యాచ్‌లో మొదటి రెండు రోజులు వికెట్ ఎంతో ఫ్లాట్‌గా ఉంది. మైదానంలో నాతో సహా అందరం ఉత్తేజంతో ఆడలేకపోయాం. అయితే రెండో ఇన్నింగ్స్‌ నుంచి మా దేహభాషలో మార్పులు వచ్చాయి. ఇక ఈ టెస్టులో ప్రధాన తేడా ప్రజలే. ధైర్యం, సంకల్పంతో మేం ఆడటానికి కారణం వాళ్లే. నేను బౌలింగ్‌ చేయడానికైనా అభిమానుల నుంచి మద్దతు అవసరం. మాకు అది ఎంతో లభించింది’’ అని తెలిపాడు.

బ్యాటింగ్‌తో పాటు వికెట్‌కీపింగ్‌లో సత్తాచాటిన రిషభ్‌ పంత్‌ను కోహ్లీ కొనియాడాడు. ‘‘పంత్ ఆస్ట్రేలియాలో ఎంతో శ్రమించాడు. అతడు వికెట్‌ కీపింగ్‌లో మార్పులు మీరు గమనించే ఉంటారు. అంతేగాక అతడు బరువు తగ్గాడు. ఎంతో శ్రమిస్తున్నాడు. టర్న్‌, బౌన్స్‌ అవుతున్నా వికెట్ల వెనుక మంచి ప్రదర్శన చేశాడు. వికెట్‌కీపింగ్‌లో అతడు మరింత మెరుగవ్వాలని కోరుకుంటున్నాం. అతడు జట్టుకు ఎంత విలువైన ఆటగాడో మాకు తెలుసు’’ అని కోహ్లీ వెల్లడించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని