రాష్ట్రం మొత్తానికి సాగు నీరందిస్తాం:హరీశ్‌రావు
close

తాజా వార్తలు

Published : 23/03/2021 14:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాష్ట్రం మొత్తానికి సాగు నీరందిస్తాం:హరీశ్‌రావు

సిద్దిపేట: త్వరలో రాష్ట్రం మొత్తానికి సాగునీరు అందిస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ ఉదయం కూడవెళ్లి వాగుకు మంత్రి గోదావరి జలాలను విడుదల చేశారు. ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చిన అనంతరం కొడకండ్ల వద్ద కొండపోచమ్మ కాల్వ నుంచి కూడవెళ్లి వాగుకు నీటిని విడుదల చేశారు. మల్లన్న సాగర్‌ కాల్వ నుంచి కూడవెళ్లి వాగుకు అనుసంధాన కాలువ ద్వారా జలాలు తరలుతున్నాయి. ప్రస్తుతం విడుదల చేసిన నీటితో 12 వేల ఎకరాలకు సాగునీరు అందనుందని హరీశ్‌రావు తెలిపారు. గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాల్లో వేలాది మంది రైతులకు ప్రయోజనం కలగనుందని ఆయన వెల్లడించారు. గోదావరి నీటిని 500 మీటర్ల ఎత్తుకు తీసుకొచ్చి సాగునీరు ఇస్తున్నామని తెలిపారు.

సీఎంగా కేసీఆర్‌ లేకుంటే గోదావరి జలాలు కూడవెళ్లి వాగులో పారేవి కావని హరీశ్‌రావు అన్నారు. తెరాస అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు ఇస్తున్నామన్నారు. కూడవెళ్లిలో ప్రవహించే నీరే.. విమర్శించిన వారికి చెంపపెట్టు అని స్పష్టం చేశారు. గోదావరి నీరు సజీవంగా రైతుల పొలాల్లో ప్రవహిస్తోందన్నారు. రైతులు ఆకాశం, బోరు బండి వైపు చూడాల్సిన అవసరం లేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని