12 కోట్ల డోసులకు ఒకే చెక్కుతో చెల్లిస్తాం: ఉద్ధవ్‌
close

తాజా వార్తలు

Published : 01/05/2021 13:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

12 కోట్ల డోసులకు ఒకే చెక్కుతో చెల్లిస్తాం: ఉద్ధవ్‌

ముంబయి: మహారాష్ట్రలో కరోనా మూడో వేవ్‌(Third Wave)ను సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే వెల్లడించారు. సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు విధించకపోయి ఉంటే ఇప్పటికీ 9-10 లక్షల క్రియాశీల కేసులు ఉండేవని అభిప్రాయపడ్డారు. పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ విధించే స్థాయికి పరిస్థితులు దిగజారకపోవచ్చునని తెలిపారు. వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్న మేరకే నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు అందజేస్తామని పేర్కొన్నారు.

18-44 ఏళ్ల వారందరికీ టీకాలిచ్చేందుకు అనుమతించినందుకు ప్రధాని మోదీకి ఉద్ధవ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ కేటగిరీలో రాష్ట్రంలో ఆరు కోట్ల మంది ఉన్నారని.. వారికి కావాల్సిన 12 కోట్ల డోసులకు చెక్కు రూపంలో ఒకేసారి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే వ్యాక్సిన్ల సరఫరాలో పరిమితులు ఉన్నాయన్నారు. సీరం, భారత్‌ బయోటెక్‌తో పాటు స్పుత్నిక్‌-వితోనూ సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు.

హైరానా పడకుండా కేవలం కొవిన్‌లో రిజిస్టర్‌ చేసుకున్న వారు మాత్రమే టీకా కేంద్రాలకు వెళ్లాలని ప్రజలకు ఉద్ధవ్‌ విజ్ఞప్తి చేశారు. జూన్‌-జులై నాటికి టీకాల సరఫరా పెరుగుతుందని తెలిపారు. మే నెలలో 18 లక్షల డోసులు అందనున్నాయని వెల్లడించారు. కొవిన్‌ క్రాష్‌ అయిన నేపథ్యంలో మరో యాప్‌ ప్రారంభించాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. కఠిన ఆంక్షల వల్ల జీవనోపాధి దెబ్బతిన్నప్పటికీ.. ఆహార కొరత తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని