porn videos racket: ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏంటి?

తాజా వార్తలు

Published : 28/07/2021 01:41 IST

porn videos racket: ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏంటి?

ముంబయి: భర్త రాజ్‌కుంద్రా అశ్లీల వ్యాపారం గురించి తనకేమీ తెలియదని శిల్పాశెట్టి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా రాజ్‌కుంద్రాను ఆయన నివాసంలో ప్రశ్నించేందుకు తీసుకెళ్లగా.. భర్త చేసే చీకటి వ్యాపారాల గురించి తనకేమీ తెలియదని శిల్పాశెట్టి కన్నీరుమున్నీరైనట్లు ముంబయి పోలీసు వర్గాలు తెలిపాయి.

దర్యాప్తులో భాగంగా రాజ్ కుంద్రాను ముంబయిలోని ఆయన నివాసానికి తీసుకెళ్లామని.. అక్కడే శిల్పాశెట్టిని కూడా ప్రశ్నించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. విచారణ అనంతరం శిల్పా కలవరపాటుకు గురయ్యారని, భర్తతో ఆమె వాదనకు దిగినట్లు వెల్లడించాయి. ‘ఈ యాప్‌ల గురించి నాకేమీ తెలియనివ్వలేదు. ఈ వ్యవహారం వల్ల కుటుంబం అపఖ్యాతి పాలవుతోంది. అనేక కాంట్రాక్టులు రద్దవుతున్నాయి. కుటుంబం భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది’ అని శిల్పా ఆవేదన వ్యక్తం చేసినట్లు పోలీసు వర్గాలు వివరించాయి. ‘సమాజంలో అత్యున్నత స్థానంలో ఉన్న నువ్వు.. ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏంటి?’ అని భర్తను నిలదీసినట్లు పేర్కొన్నాయి. కాగా అశ్లీల చిత్రాల నిర్మాణం వ్యవహారంపై గత శుక్రవారం శిల్పాను పోలీసులు ప్రశ్నించగా.. తన భర్త అమాయకుడని, ఆయనకు ఇందులో ఎలాంటి సంబంధం లేదని చెప్పడం గమనార్హం.

శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా సంయుక్త ఖాతాలో రూ.కోట్లలో లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో భాగంగా క్రైమ్ బ్రాంచ్ గుర్తించింది. ‘హాట్​ షాట్స్’, ‘బాలీ ఫేమ్’ యాప్‌ల ద్వారా వచ్చే ఆదాయాలు ఈ ఖాతాలోకి వచ్చాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుంద్రాకు చెందిన వియాన్‌ సంస్థలో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన శిల్పా.. గతేడాది రాజీనామా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి గల కారణాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని