వాట్సాప్‌: ఇకపై మీ స్టిక్కర్లు మీరే చేసుకోవచ్చు

తాజా వార్తలు

Published : 02/03/2021 17:33 IST

వాట్సాప్‌: ఇకపై మీ స్టిక్కర్లు మీరే చేసుకోవచ్చు

భారత్‌ సహా రెండు దేశాల్లో అందుబాటులోకి తెచ్చిన సంస్థ

వాషింగ్టన్‌: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తాజాగా కస్టమ్-యానిమేటెడ్‌ స్టిక్కర్ల ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా వినియోగదారులు తమ స్టిక్కర్లను తామే తయారు చేసుకొనే వీలుంది. ముందుగా ఈ ఫీచర్‌ను భారత్‌, బ్రెజిల్‌, ఇండోనేసియా దేశాల్లో ప్రవేశపెట్టినట్లు ఆ సంస్థ మంగళవారం ప్రకటించింది. ఈ మూడు దేశాల వినియోగదారులు ఈ ఫీచర్‌పై ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చిన అనంతరం దాన్ని ఇతర దేశాలకు విస్తరింపజేస్తామని వారు తెలిపారు. ‘‘ భారత్‌, బ్రెజిల్‌, ఇండోనేసియాలోని ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో స్టిక్కర్‌ మేకర్‌ యాప్‌ ఆధారంగా వినియోగదారులు సొంతంగా స్టిక్కర్లు తయారుచేసుకోవచ్చు.’’ అని వాబీటా ఇన్ఫో వెబ్‌సైట్‌ తెలిపింది. వాబీటా ఇన్ఫో తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘స్టిక్కర్‌ మేకర్‌ యాప్‌ ద్వారా వినియోగదారులు సొంతంగా స్టిక్కర్లను తయారు చేసుకోవచ్చు. దాని కోసం స్టిక్కర్‌ మేకర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని మీ వీడియో లేక జిఫ్‌( జీఐఎఫ్‌)ను ఎంచుకోవాలి. తర్వాత ఆ యాప్‌ దానంతట అదే స్టిక్కర్స్‌ను తయారుచేస్తుంది. అవి వెబ్‌పి ఫైల్‌ ఫార్మాట్‌లో ఉండి వాట్సాప్‌లో వినియోగించేందుకు వీలుగా ఉంటాయి.’’ అని వారు తెలిపారు.

వేటిలో వాడొచ్చంటే..

ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ 2.21.3.19, తర్వాతి వెర్షన్‌లు, ఐఫోన్‌లో ఐతే ఐవోఎస్‌ 2.21.31.2, తర్వాతి వెర్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్‌ను మంగళవారమే విడుదల చేశారు కాబట్టి వినియోగదారులకు 24 గంటల తర్వాత అందుబాటులోకి వస్తుంది. యానిమేటెడ్‌ స్టిక్కర్‌ ప్యాక్‌లు, సాధారణ స్టిక్కర్‌ ప్యాక్‌లు విడివిడిగా ఇంపోర్ట్‌ చేసుకోవాలి. ఒక ప్యాక్‌లో మినిమమ్‌ మూడు స్టిక్కర్లు ఉండాలి. వినియోగదారులు ఎంచుకున్న వీడియో, జిఫ్‌ పైల్‌ సైజును స్టిక్కర్‌ మేకర్‌ యాప్‌ అదే క్వాలిటీతో ఆటోమాటిక్‌గా కంప్రెస్‌ చేస్తుంది.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని