CoronaVaccine: విస్తృతంగా ఎప్పుడు లభిస్తుందంటే?
close

తాజా వార్తలు

Published : 14/05/2021 19:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

CoronaVaccine: విస్తృతంగా ఎప్పుడు లభిస్తుందంటే?

వాషింగ్టన్‌: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా టీకా కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ..కొన్ని ఆఫ్రికా దేశాల్లో మాత్రం ఇప్పటికీ టీకా అందుబాటులోకి రాలేదు. ప్రపంచమంతటా విస్తృతంగా టీకాలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే ప్రశ్నే ఇప్పుడు అందరిని వేధిస్తోంది. కాగా, 2023, అంతకంటే ముందే కొన్ని దేశాల్లో విస్తృతంగా కరోనాటీకాలు లభ్యమవుతాయని నిపుణులు అంటున్నారు.

అమెరికా, ఇజ్రాయెల్, యూకేల్లో ఇప్పటికే సగానికి పైగా ప్రజలు కనీసం ఒక్క డోసు టీకా పొందారని డ్యూక్ విశ్వవిద్యాలయం నిపుణులు వెల్లడించారు. అదే సమయంలో పాకిస్థాన్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఒక్కశాతం కన్నా తక్కువ మందికే టీకా అందిందని తెలిపారు. దాదాపు డజనుకు పైగా దేశాలు.. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో అసలు వ్యాక్సినేషనే జరగలేదని పేర్కొన్నారు. ఇందుకు కొనుగోలు శక్తి, ఉత్పత్తి సామర్థ్యం, ముడి పదార్థాల లభ్యత, ప్రపంచ మేధో సంపత్తి చట్టాలే కారణమని వారు అభిప్రాయపడ్డారు. టీకాల కోసం మేధో సంపత్తి రక్షణను వదులుకోవడానికి అమెరికా మద్దతు తెలిపింది. అయితే ఈ అంశంపై ప్రపంచ ఒప్పందం ఉంటుందా?ఉత్పత్తిని వేగవంతం చేయడానికి అది సహాయపడుతుందా?.. అనే విషయంపై స్పష్టత లేదని తెలిపారు. కేవలం కొవాక్స్ కార్యక్రమం సహాయంతోనే చాలా దేశాల్లో 2023 నాటికి 60శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయలేమన్నారు. అమెరికా, పలు ఐరోపా దేశాలు టీకాలకు ఆర్డర్లు ఇచ్చాయన్నారు. ప్రస్తుతం ఆయాదేశాల దగ్గర టీకాల కొనుగోలుకు డబ్బులున్నా, వాటి కోసం వరసలో ఉండాల్సిన పరిస్థితి నెలకొందని వారు చెప్పారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని