ఎవరీ రాకేశ్‌ టికాయిత్‌?
close

తాజా వార్తలు

Updated : 03/02/2021 14:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎవరీ రాకేశ్‌ టికాయిత్‌?

పోలీస్‌ ఉద్యోగం వదిలి.. రైతు ఉద్యమంలోకి..

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన.. రిపబ్లిక్‌ డే ట్రాక్టర్ల పరేడ్‌తో అనూహ్య మలుపు తిరిగింది. ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో 60 రోజులకు పైగా శాంతియుతంగా కొనసాగిన రైతు ఉద్యమంపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనల తర్వాత ముఖ్యంగా రైతు నాయకుడు రాకేశ్‌ టికాయిత్‌పై ఆరోపణలు వస్తున్నాయి. దీని వెనుక ఆయన పాత్ర ఉందంటూ పోలీసులు ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. దిల్లీ శివార్లలో రైతు ఉద్యమం మొదలైనప్పటి నుంచీ టికాయిత్‌ పేరు ప్రముఖంగా వినపడుతోంది. ఇంతకీ అసలు ఎవరీ రాకేశ్‌ టికాయిత్‌? ఆయన నేపథ్యం ఏమిటి?

రాకేశ్‌ టికాయిత్..‌ రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న రైతు సంఘాల్లో ఒకటైన బీకేయూ నేత. మూడు వ్యవసాయ చట్టాల్ని రద్దుచేయాలంటున్న రైతుల వాణిని కేంద్రానికి వినిపిస్తున్నారు. యూపీకి చెందిన ఆయన‌.. ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించగలరని అనేకమంది రైతులు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఇందుకు ఆయన నేపథ్యం కూడా ఒక కారణం.

రాకేశ్‌ టికాయిత్‌ 1969, జూన్‌ 4న యూపీలోని ముజఫర్‌నగర్‌ జిల్లా సిసౌలీ గ్రామంలో జన్మించారు. మీరట్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టా అందుకున్నారు. ఎల్‌ఎల్‌బీ కూడా పూర్తి చేశారు. 

రాకేశ్‌ తండ్రి మహేంద్రసింగ్‌ టికాయిత్‌ కూడా ఓ పెద్ద రైతు నాయకుడే. 90ల్లో రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా లక్షలాది మందితో దిల్లీ ముట్టడి కార్యక్రమానికి ఆయన నాయకత్వం వహించారు. రాజీవ్‌ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు పోరాటాన్ని ముందుకు నడిపించడంలో మహేంద్ర సింగ్‌ కీలక పాత్ర పోషించారు. 

రైతు ఉద్యమంలోకి రావడానికి ముందు రాకేశ్‌ కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. 1992లో దిల్లీ పోలీస్‌ విభాగంలో ఆయన చేరారు. అయితే, ఆయన తండ్రి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో రాకేశ్‌పై రాజకీయపరమైన ఒత్తిడి వచ్చింది. తండ్రిని ఒప్పించి రైతు పోరాటాన్ని నిలిపివేయాలన్న ఒత్తిడి రావడంతో తన ఉద్యోగాన్ని వదులుకొన్నారు.

ప్రస్తుతం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతు పోరాటంలో భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) ఒకటి. ఈ సంఘానికి జాతీయ అధికార ప్రతినిధిగా రాకేశ్‌ టికాయిత్‌ కొనసాగుతున్నారు. ఆయన పెద్ద అన్నయ్య నరేశ్‌ టికాయిత్‌ బీకేయూ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు.

 

రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న రాకేశ్‌ టికాయిత్‌ రెండుసార్లు ఎన్నికల్లో పోటీచేసినా కలిసి రాలేదు. 2007లో ముజఫర్‌నగర్‌లోని ఖటౌలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014లో అమ్రోహ నుంచి లోక్‌సభకు ఆర్‌ఎల్డీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

ఇదీ చదవండి..

రైతు ఉద్యమకారులపై ఉచ్చు

కొత్త సాగు చట్టాల రాజ్యాంగబద్ధతపై సమాధానమివ్వండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని