భర్తను చంపి ఇంటి వెనకాలే పూడ్చి..
close

తాజా వార్తలు

Updated : 10/03/2021 18:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భర్తను చంపి ఇంటి వెనకాలే పూడ్చి..

హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం

వనస్థలిపురం: హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం జరిగింది. నౌషీన్‌ బేగం అనే మహిళ తన భర్త గగన్ అగర్వాల్ (38)ను హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న సహారా రోడ్డులోని వివేకానందనగర్‌ కాలనీలో గగన్‌ అగర్వాల్‌ (38) అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. రెండేళ్ల క్రితం మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన గగన్‌ గత ఏడాది జులైలో పాతబస్తీకి చెందిన నౌషీన్‌ బేగం(38)ను రెండో వివాహం చేసుకున్నారు. అయితే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి గగన్‌ కనిపించకుండా పోయారు. గగన్‌ సోదరుడు.. తన అన్న కనిపించకుండా పోవడంపై 8వ తేదీన వదినను ప్రశ్నించాడు. అనంతరం ఇద్దరు కలిసి ఎల్బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసు వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వస్తున్నందున ఎల్బీనగర్‌ పోలీసులు కేసును అక్కడికి బదిలీ చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత బేగం తన ఇంటికి తాళం వేసి పాతబస్తీలోని పుట్టింటికి వెళ్లిపోయింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం ఉదయం నౌషీన్‌ను విచారించారు. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు తమదైన శైలిలో ఆమెను ప్రశ్నించారు. ఫిబ్రవరి 6న గగన్‌ స్నేహితుడు సునీల్‌ సాయంతో భర్తను హత్య చేసి ఇంటి వెనకాల పూడ్చిపెట్టినట్లు అంగీకరించింది. నౌషీన్ ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గగన్‌ మృతదేహాన్ని వెలికితీసి ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం నిందితుడు సునీల్‌ పరారీలో ఉన్నాడు. అయితే కుమార్తెతో అసభ్య ప్రవర్తన వల్లే భర్తను చంపినట్లు నౌషీన్‌ చెబుతోందని ఏసీపీ పురుషోత్తం రెడ్డి చెప్పారు. ఈ హత్యకు సంబంధించి ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని