నా కుమారుడికి తండ్రి పేరేం చెప్పను..?
close

తాజా వార్తలు

Updated : 07/03/2021 04:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా కుమారుడికి తండ్రి పేరేం చెప్పను..?

షహనాజ్‌పుర్: అత్యాచారానికి గురైన మహిళ.. ఆ ఘటన వల్ల తనకు జన్మించిన సంతానానికి తండ్రి పేరేం చెప్పాలని ప్రశ్నిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అది కూడా లైంగిక దాడి జరిగిన 27 సంవత్సరాల తరువాత. కోర్టు ఆదేశాల మేరకు ఆమె యుక్తవయసులో ఉన్నప్పుడు జరిగిన ఘటనపై పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. వారు చెప్పిన వివరాల ప్రకారం..

27 సంవత్సరాల క్రితం బాధితురాలు ఉత్తర్‌ప్రదేశ్‌లోని షహనాజ్‌పూర్‌లో తన అక్క, బావలతో కలిసి ఉండేది. అప్పుడు ఆమె వయసు 12 సంవత్సరాలు. ఒకసారి ఆమె ఒంటరిగా ఉన్న విషయాన్ని పసిగట్టి, అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తర్వాత నిందితుడు సోదరుడు కూడా జత కలిశాడు. వారిద్దరూ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు నగర ఎస్పీ సంజయ్ కుమార్ వెల్లడించారు. ఈ క్రమంలో గర్భం దాల్చిన ఆమె 1994లో ఓ కుమారుడికి జన్మనిచ్చింది. అనంతరం తన సొంత గ్రామమైన ఉదంపూర్‌కి చెందిన వ్యక్తికి ఆ బాలుడిని ఇచ్చేసింది. తర్వాత తన అక్క కుటుంబం బదిలీపై రాంపూర్‌కు వెళ్లడంతో బాధితురాలు కూడా వారి వెంటే వెళ్లిపోయింది. కొన్నాళ్లకు ఆమెకు వివాహం జరిగినప్పటికీ..లైంగిక దాడి గురించి తెలిసిన ఆమె భర్త విడాకులు ఇచ్చాడు. దాంతో ఆమె ఉదంపూర్‌కు వచ్చి అక్కడే ఉండిపోయింది. 

ఇంతలో పెరిగి పెద్దవాడైన బాధితురాలి కుమారుడు తల్లిదండ్రుల గురించి ఆరా తీయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే తల్లి గురించి తెలిసి ఆమెను కలుసుకున్నాడు. తండ్రి పేరు అడగ్గా..ఆమె తనకు జరిగిన దారుణాన్ని కుమారుడికి వెల్లడించింది. అంతేకాకుండా ఆ ఘటనకు సంబంధించి సదర్‌ బజార్ పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు నిందితులపై కేసు పెట్టింది. తాము కేసు దర్యాప్తు చేస్తున్నామని, బాధితురాలి కుమారుడుకి డీఎన్‌ఏ పరీక్ష నిర్వహిస్తామని కుమార్ తెలిపారు. మొదట పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించడంతో.. ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని