అదుపుతప్పి.. స్కూటీతో సహా బావిలో..
close

తాజా వార్తలు

Published : 23/04/2021 17:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదుపుతప్పి.. స్కూటీతో సహా బావిలో..

బెంగళూరు: కర్ణాటకలో స్కూటీపై వెళుతున్న ఓ మహిళ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న 20 అడుగుల లోతులో ఉన్న బావిలో పడిపోయింది. దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్‌లో రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. స్థానికుల సాయంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఉక్కూడకు చెందిన మోహిని అనే మహిళ విట్ల వైపు స్కూటీపై వెళుతుండగా మరో ద్విచక్రవాహనం ఆమెను ఓవర్‌టేక్‌ చేసింది. ఈ క్రమంలో అదుపుతప్పి కిందపడిన ఆమె స్కూటీని పైకెత్తే క్రమంలో యాక్సిలరేటర్‌ ఇవ్వగా వాహనంతోపాటు ఆమె బావిలో పడిపోయింది. ఆ రోడ్డు వెంట వెళ్లేవారు ఇది గమనించి మహిళను కాపాడారు. సీసీ టీవీలో రికార్డయిన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని