ప్రేమ వివాహం.. అయినా అనుమానం..!
close

తాజా వార్తలు

Updated : 31/01/2021 11:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రేమ వివాహం.. అయినా అనుమానం..!

చిట్టినగర్, న్యూస్‌టుడే: వారి మనసులు కలిశాయి. వివాహంతో ఒక్కటయ్యారు. అయితే.. ప్రేమించే భర్తే తనను అనుమానించడంతో ఆమె ప్రాణం తీసుకున్న సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహంతిపురం అప్పలస్వామివీధిలో వాసుపల్లి సాయి దివ్య (24) గురుమూర్తి దంపతులు నివాసం ఉంటున్నారు. వారిద్దరు 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి మూడేళ్ల బాలిక ఉంది. భర్త ఓ కెమికల్‌ షాపులో పనిచేస్తున్నాడు. ఆయన భార్యపై అనుమానం పడుతుండటంతో తరచూ ఇద్దరూ గొడవ పడుతుండేవారు. ఈ నేపథ]్యంలో శుక్రవారం రాత్రి గొడవ పడ్డారు. మనస్తాపం చెందిన సాయిదివ్య శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న కొత్తపేట సీఐ ఉమర్, ఎస్‌ఐ రమేష్‌కుమార్‌లు వెళ్లి పరిశీలించారు. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఝూన్సీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి

ఈ పుస్తకం మనిషిని చంపేస్తుంది!

భార్యను చంపి..ఆపై భర్త ఆత్మహత్య


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని