close

తాజా వార్తలు

Published : 22/10/2020 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

68 ఏళ్ల బామ్మ..2వేల కిమీ సైకిల్‌ యాత్ర! 

ముంబయి: భక్తి అనేది మనిషిని ఎంతటి సాహసానికైనా ప్రేరేపిస్తుందనడానికి ఈ వార్త మంచి ఉదాహరణ. మహారాష్ట్రకు చెందిన ఓ 68 ఏళ్ల వృద్ధురాలు దేవుడిని దర్శించుకునేందుకు సైకిల్‌పై వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.. ఆమె ప్రయాణానికి  సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఆమె యాత్ర వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన ఓ 68 ఏళ్ల వృద్ధురాలు కశ్మీర్‌లోని వైష్ణోదేవీ ఆలయాన్ని సందర్శించేందుకు బయలుదేరారు. ఇందుకోసం ఆమె 2200 కిలోమీటర్ల యాత్రను సైకిల్‌పై చేపట్టారు. కాగా మార్గ మధ్యలో ఆమెను గుర్తించిన ఓ వ్యక్తి ఆమె యాత్రకు సంబంధించిన వివరాలను అడిగి వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. కాగా ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ వయసులో ఆమె భక్తి కోసం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘ఆమె తన యాత్రను క్షేమంగా పూర్తి చేయాలని కోరుతున్నా’అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.