తల్లీ.. నీకు వందనం
close

తాజా వార్తలు

Published : 11/07/2020 07:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తల్లీ.. నీకు వందనం

9వ కాన్పునకు సిద్ధంగా మాతృమూర్తి

ఇంటి వద్దే ఎనిమిది ప్రసవాలు
ప్రసవానంతరం కు.ని. శస్త్ర చికిత్స చేయించుకోవాలని వైద్యుల సూచన

వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన ఇడియాతో ఆస్పత్రి

సూపరింటెండెంట్, ఆశా కార్యకర్త

పాల్వంచ పట్టణం, న్యూస్‌టుడే:  ఓ మహిళ ఏకంగా 9వ కాన్పునకు తొమ్మిదో నెల పరీక్షలు చేయించుకునేందుకు శుక్రవారం పాల్వంచ సామాజిక ఆస్పత్రికి వచ్చింది. పాల్వంచ మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన మడకం ఇడిమా(36), కోసా దంపతులకు ఎనిమిది మంది సంతానం. ఇడిమా ప్రస్తుతం తొమ్మిదో నెల గర్భిణి. ప్రసవానికి సమయం దగ్గర పడుతుండటంతో ఆశా కార్యకర్త సాయంతో పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. అరుదుగా వచ్చే కాన్పు కావడంతో వైద్య సిబ్బంది సమాచారాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ముక్కంటేశ్వరరావుకు తెలిపారు. ఆయన వైద్య పరీక్షలు చేయించారు. పరీక్ష ఫలితాల్లో రక్తం సరిపడా ఉండటం, ఇతర సమస్యలేవీ లేకపోవడంతో ప్రసవానికి ఇబ్బందులు ఉండకపోవచ్చన్నారు. గతంలో ఎనిమిది ప్రసవాలు ఇంటి వద్దే సాధారణంగా జరిగాయని ఇడిమా తెలిపారు. ఎనిమిది మంది సంతానంలో ఇద్దరు చనిపోయారని, పెద్ద కుమార్తెకు వివాహం చేసినట్లుగా వివరించారు. 9వ కాన్పు తప్పనిసరిగా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేయించుకోవాలని, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స నిర్వహిస్తామని వైద్యులు వివరించారు. మందులిచ్చి 102 వాహనంలో ఇంటికి పంపారు. ఇలాంటి అరుదైన కాన్పులను వైద్య పరిభాషలో ‘గ్రాండ్‌ మల్టీ ప్యారా’ అంటారని సూపరింటెండెంట్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని