టీ తాగి ఆమె చనిపోయింది.. 
close

తాజా వార్తలు

Published : 01/04/2021 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీ తాగి ఆమె చనిపోయింది.. 

బచ్చన్నపేట: రోజు మాదిరిగానే ఇవాళ కూడా ఆ కుటుంబం టీ తాగింది. అయితే పాలలో టీ పొడి బదులు విషగుళికలు చేరడంతో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తెలంగాణలోని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన దంపతులు అంజమ్మ, దాసారం మల్లయ్య, అంజమ్మ మరిది భిక్షపతి ఈ ఉదయం టీ తాగారు. అంజమ్మ టీ చేసే సమయంలో టీ పొడి అనుకొని పొరపాటున పాలలో విష గుళికలు వేశారు. టీ తాగిన 10 నిమిషాలకు ముగ్గురూ అస్వస్థతకు గురయ్యారు. వీరిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అంజమ్మ చనిపోయారు. మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. కేసు నమోదు చేసి ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపారు.   


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని