ఆ మహిళ.. ఒక మగాడు: పాతికేళ్లకు తెలిసిన నిజం!
close

తాజా వార్తలు

Updated : 17/03/2021 09:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ మహిళ.. ఒక మగాడు: పాతికేళ్లకు తెలిసిన నిజం!

బీజింగ్‌: ఆమెకు వివాహమై సంతోషకరమైన జీవితం గడుపుతోంది కానీ, పిల్లలు కలగట్లేదనే ఒకే ఒక్క బాధ. అందుకే, ఆ దంపతులు ఇద్దరూ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఇంతలో ఆమె కాలికి గాయమైంది. ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు జరిపించారు. తీరా చూస్తే ఇన్నాళ్లు మహిళగా భావిస్తున్న ఆమె, అసలు మహిళే కాదని తేలింది. పురుషుడిగా జన్మించి జన్యులోపం కారణంగా మహిళగా మారిందని వైద్యులు గుర్తించారు. పాతికేళ్ల తర్వాత నిజం తెలుసుకొని మహిళతోపాటు అందరూ ఆశ్చర్యపోయారు. చైనాలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

సాధారణంగా అమ్మాయిలకు కౌమరదశకు రాగానే రుతుస్రావం మొదలువుతుంది. కానీ, చైనాలోని జెజియాంగ్‌ ప్రావిన్స్‌కు చెందిన పింగ్‌పింగ్‌ అనే అమ్మాయి విషయంలో అలా జరగలేదు. దీంతో వైద్యులను సంప్రదిస్తే.. శరీరంలో ఎదుగుదల నెమ్మదిగా ఉందని.. సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుందని చెప్పారట. ఆ ధీమాతో మహిళకు వివాహం చేశారు. అయితే, గతకొంతకాలంగా ఆమె సంతానం కోసం ప్రయత్నిస్తోంది. అయినా గర్భం దాల్చట్లేదు. కాగా, ఇటీవల ఆమె కాలికి దెబ్బతగలడంతో కుటుంబసభ్యులు యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఆస్పత్రిలో చేర్పించారు. కాలికి ఎక్స్‌-రే తీయగా.. ఆమె శరీరంలో ఎముకలు ఎదగలేదని వైద్యులు గుర్తించారు. అనుమానం వచ్చి మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో విస్తుపోయే విషయం తెలిసింది. వైద్య నివేదికలో ఆమెలో గర్భాశయం, అండాశయం లేదని కూడా తేలింది. ఆ మహిళ పుట్టడంతోనే సరిగా ఎదగని స్త్రీ, పురుష జననాంగాలతో పుట్టిందట. దీంతో బాహ్యశరీరం మహిళగా కనిపిస్తున్నా జన్యుపరంగా ఆమె పురుషడని వైద్యులు పేర్కొన్నారు. అందుకే ఆమెకు రుతుస్రావం అవ్వట్లేదని వైద్యులు వెల్లడించారు. ఆమె తల్లిదండ్రులు ఒకే రక్తసంబంధం ఉన్న వాళ్లు కావడం వల్ల ఈ జన్యులోపం తలెత్తిందని చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని