పెంపుడు కుక్క కోసం యువతి ఆత్మహత్య!
close

తాజా వార్తలు

Published : 20/11/2020 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెంపుడు కుక్క కోసం యువతి ఆత్మహత్య!

రాయగఢ్‌‌: పెంపుడు శునకంపై ఉన్న అతి ప్రేమ ఓ యువతిని ప్రాణాలు తీసుకునేలా చేసింది. తన పెంపుడు శునకం మరణించిన వార్త జీర్ణించుకోలేక ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. కోట్ర పోలీస్‌స్టేషన్‌ అధికారి చమన్‌ సిన్హా తెలిపిన వివరాల ప్రకారం.. ప్రియాంశు సింగ్‌(21) పీజీ చదువుతోంది. మంగళవారం రాత్రి తన పెంపుడు శునకం మరణించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. శునకాన్ని ఖననం చేసిన ఆ తర్వాతి రోజు ఉదయాన్నే ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆందోళనతో కుటుంబసభ్యులు ఆమె గదిలోకి వెళ్లి పరిశీలించగా ఓ లేఖ దొరికింది. అందులో ఆమె తనను తన శునకంతో పాటే ఖననం చేయాలని పేర్కొన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని