తూర్పుగోదావరిలో వేడెక్కిన రాజకీయం
close

తాజా వార్తలు

Updated : 23/12/2020 11:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తూర్పుగోదావరిలో వేడెక్కిన రాజకీయం

అనపర్తి : తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అనపర్తి శాసనసభ్యుడు సత్తి సూర్యనారాయణరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అవినీతి ఆరోపణలు చేశారు. మైనింగ్‌ సహా పలు ఆరోపణలను ఆయనపై గుప్పించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి బిక్కవోలులోని శ్రీలక్ష్మీగణపతి ఆలయంలో ప్రమాణానికి సిద్ధమని  రామకృష్ణారెడ్డికి సవాలు విసిరారు. ఈ సవాల్‌ను తాను స్వీకరించానని, ప్రమాణాలకు ముందు తాను చేసిన ఆరోపణలపై చర్చ జరగాలని, చర్చ అనంతరం ప్రమాణం చేద్దామని మాజీ ఎమ్మెల్యే ప్రతి సవాల్‌ విసిరారు.  ఈ క్రమంలో ఇరువురు నేతల ప్రమాణానికి స్థానిక పోలీసులు అనుమతించారు. ఇరువురు నేతల వెంట ఐదుగురు నాయకుల చొప్పున మాత్రమే వెళ్లాలని పోలీసులు పేర్కొన్నారు. 

దీంతో ఇవాళ మధ్యాహ్నాం ప్రమాణాలకు ఇరుపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ పరిణామం ఉత్కంఠ రేపుతుండగా భారీ బందోబస్తుతో ఉద్రిక్తతలను నివారించడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే పలువురు వైకాపా, తెదేపా నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో అనపర్తి, బొక్కబోలు మండలాల్లో 144 సెక్షన్‌, పోలీసు చట్టం 30 అమల్లో ఉందని పోలీసులు ప్రకటించారు.

మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గృహ నిర్బంధం..

అధికార, ప్రతిపక్ష నాయకులు ప్రమాణం చేయడానికి అనుమతించిన పోలీసులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్యే మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రమాణం చేస్తారని, సాయంత్రం 4.30 గంటలకు ప్రమాణం చేయడానికి తనకు అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే చెబుతున్నారు. ప్రమాణం అంటే ఒకేసారి చేయాలని ఇలా చేయడం సమంజసం కాదని ఆయన వివరించారు. ఎమ్మెల్యేపై ప్రధానంగా తాను చేస్తున్న 15 ఆరోపణలపై ప్రమాణం చేస్తానని, ఆయన రూ. 500 కోట్ల అవినీతికి పాల్పడ్డారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. 

 

 

ఇవీ చదవంది..
రాజధాని పోరులో ఆగిన మరో రైతు గుండె

కత్తితో పొడుచుకున్న కౌలు రైతు


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని