close

తాజా వార్తలు

Published : 25/02/2021 16:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బావిలో పూడిక తీస్తూ కూలీల మృతి

 

హుస్నాబాద్‌ గ్రామీణం: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలంలోని భల్లూనాయక్‌ తాండాలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా క్రేన్‌ పడి గురువారం ఇద్దరు కూలీలు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. దేవోజీ అనే రైతుకు చెందిన వ్యవసాయ బావిలో 15 రోజులుగా పూడిక తీస్తున్నారు. ఇవాళ బావిలోని పెద్ద బండరాయిని పైకి తీసుకొచ్చే క్రమంలో క్రేన్‌ అమాంతం పైకి లేచి బావిలో పడిపోయింది. ఆ సమయంలో బావిలో పని చేస్తున్న కూలీలు బీమా(55), శాంతి(35) అక్కడికక్కడే మృతి చెందారు. ఇస్లావత్‌ వెంకన్న అనే మరో కూలీకి తీవ్రంగా గాయలయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో వరంగల్‌ ఎమ్‌జీఎమ్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


ఇవీ చదవండి


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని