వ్యాక్సిన్లు పంచుకోండి: పీయూష్‌ గోయల్‌
close

తాజా వార్తలు

Updated : 13/05/2021 04:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాక్సిన్లు పంచుకోండి: పీయూష్‌ గోయల్‌

దిల్లీ: కరోనా విజృంభిస్తున్న వేళ అవసరమైన దేశాలకు టీకాలను పంపిణీ చేయాలని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రపంచ దేశాలను కోరారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం గ్లోబల్‌ ట్రేడ్‌ అవుట్‌లుక్‌ సెషన్లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే భారత్‌ కరోనాను జయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు కొవిడ్‌ పోరాటంలో భారతదేశానికి తమ సంఘీభావం తెలపాలని ఆయన కోరారు.

భారత్‌ ప్రపంచాన్ని వసుధైక కుటుంబంగా భావించి ఇతర దేశాలకు 67 మిలియన్ కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు అందించిందని ఈ సందర్భంగా మంత్రి  గుర్తుచేశారు. అలాగే ప్రపంచ దేశాలు కూడా కొవిడ్‌పై పోరుకు వ్యాక్సిన్ల విషయంలో ఉదారత చూపాలని కోరారు. ప్రపంచ మేధో సంపత్తి హక్కులను గౌరవిస్తుందని, ఇకముందూ కొనసాగిస్తుందని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని