భారత్‌తో కూడా ఇలానే చెప్పగలరా?
close

తాజా వార్తలు

Published : 04/02/2021 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌తో కూడా ఇలానే చెప్పగలరా?

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికా పర్యటనను ఆస్ట్రేలియా వాయిదా వేయడాన్ని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్‌ మైకేల్ వాన్‌ తీవ్రంగా తప్పుపట్టాడు. భారత పర్యటన నుంచి కూడా ఆసీస్‌ ఇలానే తప్పుకోగలదా అని ప్రశ్నించాడు. దక్షిణాఫ్రికాలో కేసులు పెరుగుతుండటం, కొత్త రకం వైరస్ వ్యాప్తి ఉండటంతో ఆటగాళ్ల భద్రతా దృష్ట్యా దక్షిణాఫ్రికా పర్యటనను ఆస్ట్రేలియా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియాను విమర్శిస్తూ మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు.

‘‘దక్షిణాఫ్రికా పర్యటనకు ఆస్ట్రేలియా దూరం కావడం ఆటకు మంచిది కాదు. ఒకవేళ భారత పర్యటన ఉంటే ఆస్ట్రేలియా ఇలానే తప్పుకుంటుందా? ప్రస్తుత పరిస్థితుల్లో బిగ్ 3 (భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్) దేశాలు ఆర్థిక భారాన్ని చూడకండా క్రికెట్ మనుగడకు వీలైనంత కృషి చేయాలి’’ అని కోరాడు. అయితే క్రికెట్‌ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయంపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎంతో నిరాశ చెందామని తెలిపింది. షెడ్యూలు ప్రకారం వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో ఆసీస్‌ మూడు టెస్టులు ఆడాల్సివుంది.

ఇవీ చదవండి

ద్రవిడ్‌పై సచిన్‌ అలిగిన వేళ..!

చెపాక్ గడ్డ.. త్రిశతకాల అడ్డా!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని