WTC Finals: ఇదీ టీమ్‌ఇండియాకు అనుకూలమే
close

తాజా వార్తలు

Published : 12/05/2021 23:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

WTC Finals: ఇదీ టీమ్‌ఇండియాకు అనుకూలమే

మానసికంగా సన్నద్ధమైన ఫైనల్స్‌ ఆడతామన్న ఫీల్డింగ్‌, బౌలింగ్‌ కోచ్‌లు

ముంబయి: ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ గెలిచేందుకు ఆటగాళ్ల అనుభవం, మానసికంగా సన్నద్ధత అవసరమని టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్ అంటున్నారు. ప్రస్తుత క్వారంటైన్ నిబంధనల వల్ల సాధనకు ఎంత సమయం దొరుకుతుందో తెలియదన్నారు. కొన్నిసార్లు అనుభవం సైతం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

‘ఇప్పుడు మనకు మరో అవకాశం ఉందనుకోను. దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే మనకెన్ని రోజులు కఠిన, సాధారణ క్వారంటైన్ ఉంటుందో తెలియదు. మనం ఇంగ్లాండ్‌ వెళ్లాక సన్నాహక మ్యాచ్‌ ఆడేందుకు అవకాశం ఉంటుందో లేదో తెలియదు’ అని శ్రీధర్‌ అన్నాడు.

‘మానసికంగా బలంగా ఉండాల్సిన సమయమిది. ఫైనల్‌ ఆడే జట్టుకు అత్యంత అనుభవం ఉంది. పరిస్థితులకు అలవాటు పడే సామర్థ్యం ప్రతి ఒక్కరికీ ఉంది. ఇంగ్లాండ్‌లో, న్యూజిలాండ్‌తో ఆడిన అనుభవం టీమ్‌ఇండియాకు ఉంది. అది చాలా విలువైంది. సాధనకు ఎన్ని సెషన్లు దొరుకుతాయో తెలియదు. అందుకే ఉన్న సమయాన్నే సద్వినియోగం చేసుకోవాలి’ అని శ్రీధర్‌ పేర్కొన్నాడు.

‘కొన్నిసార్లు సమయం లేకపోవడం అనుకూలిస్తుంది. ఎందుకంటే మానసికంగా మరింత సన్నద్ధం కావొచ్చు. ఒక్కోసారి గాయపడ్డప్పుడు మరింత ఏకాగ్రతతో ఆడటం చూస్తుంటాం. ఎక్కువ సాధన చేయనప్పుడు ఏకాగ్రతతో మెరుగ్గా ఆడతాం. అందుకే మేమిప్పుడు అలాంటి మానసిక వైఖరితోనే ఫైనల్స్‌కు వెళ్తున్నాం’ అని శ్రీధర్ తెలిపాడు.

ఇళ్ల వద్ద ఉండగానే ఆటగాళ్లకు ప్రత్యేమైన పనులు అప్పగించామని టీమ్‌ఇండియా బౌలింగ్‌ కోచ్ భరత్‌ అరుణ్‌ అన్నాడు. ‘ప్రస్తుతం బయటకు వెళ్లకుండా ఆంక్షలు ఉన్నాయి. మేమంతా కలవగానే ప్రణాళికలపై దృష్టి సారిస్తాం. మాకన్నా ముందే న్యూజిలాండ్‌తో ఇంగ్లాండ్‌ ఆడనుంది. ఇంగ్లిష్ పరిస్థితుల్లో కివీస్‌ ఎలా ఆడుతుందో ఈ సిరీస్‌ను బట్టి మనకో అవగాహన వస్తుంది. అలాగే ఆంగ్లేయుల పైనా అంచనా వస్తుంది. క్వారంటైన్‌ కాలంలో ప్రణాళికలు సిద్ధం చేసేందుకు మా ఫామ్‌ చాలా కీలకం’ అని ఆయన పేర్కొన్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని